Saturday, May 4, 2024

తేమ శాతం పెంచి కొనండి

- Advertisement -
- Advertisement -

Minister Niranjan Reddy with CCI Chairman Assembled

 

భారీ వర్షాల వల్ల పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది
తెల్లబంగారం కొనుగోలుకు మా సాఫ్ట్‌వేర్ దేశానికే ఆదర్శం
సిసిఐ చైర్మన్‌తో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పత్తి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారనేనారు. దీనికి కాటన్‌కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ)సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మంగళవారం ముంబయ్‌లోని సిసిఐ కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ ప్రదీప్‌కుమార్ అగర్వాల్‌తో మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పత్తిపంట తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. పంట తడిసిపోవడం వల్ల తేమ ఎక్కువగా ఉందని, కాబట్టి పత్తికొనుగోలు లో తేమశాతాన్ని పెంచి కొనుగోలు చేయాలని

అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో అధికారిక పర్యటనలో ఉన్న ఉన్న నిరంజన్‌రెడ్డి ఈసందర్భంగా తెలంగాణ రైతుల తరపున పలు డిమాండ్లను ఆయన చేశారు. ఈసందర్భంగా ప్రస్తుతం పత్తి కొనుగోలులో 12శాతం ఉన్న తేమ నిబంధనను సవరించాలని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. అలాగే 2019-2020 సంవత్సరానికి 49.56 లక్షల పత్తిబేళ్లను సిసిఐ నిల్వచేయగా అందులో 9.28లక్షల బేళ్లను మాత్రమే తరలించిందన్నారు. పాత నిల్వలను వెంటనే తరలించి కొత్తగా కొనుగోలు చేసిన పత్తినిల్వకు సహకరించాలని మంత్రి కోరారు.

నాబార్డ్ చైర్మన్‌తో భేటి

మహారాష్ట్రలో నాలుగు రోజుల పాటు అధికారిక పర్యటన చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాబార్డ్ ఛైర్మన్ డా.గోవిందరాజులు చింతలతో (జిఆర్ చింతల)తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రత్యేకించి రాష్ట్రంలో వ్యవసాయం తీరును వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను కూడా ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి నాబార్డ్ ఛైర్మన్‌కు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News