Saturday, April 27, 2024

యాసంగికి సన్నాహకాలు

- Advertisement -
- Advertisement -

పప్పుధాన్య పంటలపై రైతుల ఆసక్తి,  భారీగా పెరగనున్న పప్పుశనగ విస్తీర్ణం

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నే పథ్యంలో రైతులు ముందస్తు యాసంగి పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయరంగానికి ఖరీఫ్ సీజన్ ఆ శించినంతగా కలిసి రాలేదు. నైరుతి రు తుపవనాల రాకలో ఆ లస్యం జరగటం , జులైలో వదలకుం డా కరిసిన భారీ వ ర్షాలు, ఆగస్ట్‌లో వర్షాలు బిగదీసుకుపోవటం, వర్షానికి ..వర్షానికి మధ్య గ్యాప్ పెరగటం తదితర కారణాలు ఖరీ ఫ్ పంటల సాగుపై ప్రభావం చూపా యి. దీంతో రాష్ట్రంలో ఈ ప్రభావం వి విధ రకాల పంటల సాగు విస్తీర్ణపు ల క్ష్యాను కూడా మార్చివేసింది. పప్పుధాన్య పంటల సాగు సాధారణ లక్ష్యా ల్లో కనీసం 60 శాతం కూడా చేరుకోలేదు. కృష్ణానదీపరివాహక ప్రాంతంలో ఎగువ నుంచి వరద ప్రవాహాలు లేకపోవటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రా జెక్టుల కింద ఆయకట్టులో సకాలంలో ఖరీఫ్ పంటలు సాగు చేసుకు నే అవకాశాలు లేకుండా పోయాయి.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ కిం ద సుమారు ఆరు లక్షల ఎకరాల్లో ఇ ప్పటికీ అధిక శాతం విస్తీర్ణంలో పం టల సాగుకు అవకాశాలు లేక ఆయోమయ పరిస్థితి నెలకుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిధ్యాలయం కూడా సాగర్ ఆయకట్టులో వరిసాగు ఆలస్యం అయినందున ఇక వరికి బదులుగా ప్రత్యామ్నాయ పం టలు వేసుకోవలని సూచి స్తూ అందు కు సంబంధించిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వి డుదల చేసింది. అందులో పప్పుధాన్య పంట ల సాగుకు ప్రాధాన్యత కల్పించిం ది. ఇతర మరి కొన్ని ప్రాజెక్టుల కింద కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో సకాలంలో విత్త నం వేసుకోలేపోయిన రైతులు ముందస్తుగా రబీ పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు.

పెరగనున్న పప్పుశనగ విస్తీర్ణం
రాష్ట్రంలో గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అన్ని రకాల పంటలు కలిపి కోటి 32లక్షల ఎకరల విస్తీర్ణంలో సా గులోకి వచ్చాయి. ఈ ఖరీఫ్‌లో కోటి 24లక్షల ఎకరాల్లో పంటలు సాగులో కి వస్తాయ ని వ్యవసాయశాఖ అంచ నా వేయగా ఈ నెల మొదటి వారం వరకూ కోటి 20లక్షల ఎకరాల్లోనే పంటలు సాగులో కి వచ్చాయి. గత ఖ రీఫ్ విస్తీర్ణంతో పో లిస్తే సుమారు 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ సారి పంటల సాగు తగ్గునట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా పప్పుధాన్య పంటల సాగు విస్తీర్ణం పది లక్షల ఎకరాలుగా అంచ నా వేయగా, 5.40లక్షల ఎకరాలకు మిం చి విత్తనం పడలేదు.

అదను ముగిసిపోయే సరికి 57.34శాతం విస్తీర్ణానికే పప్పుధాన్య పంటల సాగు పరిమితమయింది. అక్టోబర్ నుంచి యాసంగి సీజ న్ ప్రారంభం కానుంది. శీతాకాలంలో పప్పుశనగ పంటకు అనుకూ ల వాతావరణం ఉన్నందువల్ల ఈ సా రి యాసంగిలో పప్పుశనగసాగు భా రీగా పెరిగే అ వకాశాలు ఉంటాయని అంచాన వేస్తున్నారు. గత ఏడాది రబీ లో పప్పుశనగ సాగు 3.50లక్షల ఎకరాలకు మించలేదు. ఇది ఈ సారి రె ట్టింపు అయ్యే అ వకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నా రు. పప్పుశనగతోపాటు కంది, పెసర, మినుము, అలసంద తదితర పప్పుధా న్య పంటలు సాగుపట్ల కూడా రైతులు ఆసక్తిగా ఉ న్నట్టు తెలుస్తోంది.

ఖరీఫ్‌లో పంటల సాగుకు అవకాశం లేని విస్తీర్ణంలో ఎర్లీ రబికి రైతులు మొగ్గుతున్నారు. యాసంగి వాతావరణ పరిస్థితులను దృ ష్టిలో పెట్టుకుని రైతులు పప్పుధా న్య పంటల సాగు పట్ల ఆసక్తిగా ఉన్న నేపధ్యంలో సారి ఈ పం టల విస్తీర్ణం 10లక్షల ఎకరాలు మించఅవకాశా లు ఉంటాయని చెబుతున్నా రు. మా ర్కెట్‌లో కూడా పప్పుధాన్య పం టలకు డిమాండ్ పెరిగింది. ధరలు కూ డా ఆశజనకంగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News