Sunday, April 28, 2024

గేదె చోరీ కేసు: 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: గేదె చోరీ కేసులో 58 ఏళ్ల తరువాత నిందితుడిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. 1965లో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు గణపతి విఠల్ వగోరెకు 20 ఏళ్ల వయసు ఉన్నపుడు అతనిపై గేదె చోరీ కేసు నమోదైంది. ఈ కేసులో మరో నిందితుడు కిషన్ చందర్ 2006 ఏప్రిల్ 11న మరణించాడు. దీంతో అతనిపై కేసును పోలీసులు మూసివేశారు.

తాను పెంచుకున్న రెండు గేదెలు, ఒక దూడ చోరీకి గురైనట్లు మురళీధర్‌రావు మాణిక్‌రావు కులకర్ణి అనే మెహకర్ వాసి 1965 ఏప్రిల్ 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పురస్కరించుకుని మహారాష్ట్రలోని ఉదయ్‌గిర్‌కు చెందిన కిషన్ చందర్, గణపతి విఠల్ వాగోరెఅను 1965లో పోలీసులు అరెస్టు చేశారు.

ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన వీరిద్దరూ కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారిద్దరిపై సమన్లు, వారెంట్లు జారీ అయినప్పటికీ వారి ఆచూకీని పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో నిందితులు పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు వారిపై నాంగ్ పెండింగ్ రిపోర్టు(ఎల్‌పిఆర్) దాఖలు చేశారు.

కాగా, బీదర్ ఎస్‌పి ఎల్‌ఎల్ చన్నబసవన్న ఇటీవల ఒక ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి అన్ని ఎల్‌పిఆర్ కేసులను తిరగదోడాలని ఆదేశించారు. దీంతో 58 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న 78 ఏళ్ల నిందితుడు గణపతి విఠల్ వగోరె  అరెస్టయ్యాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News