Thursday, May 2, 2024

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ట్రైనీ కలెక్టర్ శ్రీజ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిట్ట బొంగరం, సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్బిణి స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా స్కానింగ్ కేంద్రంలో గల ఏర్పాట్లను ఆమె మండల వైద్యాధికారి శ్యాంసుంధర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిలో స్కానింగ్‌లు చేయడం పట్ల ఆమె వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కానింగ్ గదిలో పరీక్షలు చేయకుండా ప్రసూతి గదిలో స్కానింగ్ చేయడం ఏమిటని, ప్రసూతి కోసం ఎవరైనా మహిళ వస్తే ఆమెకు కాన్పు ఎక్కడ చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో ఎక్కడెక్కడి ఆరోగ్య కేంద్రాలలో స్కానింగ్ యంత్రాలు పని చేస్తున్నాయని ఇంకా ఎక్కడైనా స్కానింగ్ యంత్రాలు అవసరం ఉన్నాయని డిఐఓ మిట్పల్లివార్ శ్రీధర్‌ను అడిగి తెలుసు కున్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి స్కానింగ్ కోసం వచ్చిన మహిళలతో ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల సౌకర్యాలను మరింత మెరుగుపర్చాలని వైద్యాధికారికి సూచించారు. ఆమె వెంట డిఐఓ మిట్పల్లివార్ శ్రీధర్, మండల వైద్యాధికారి శ్యాంసుంధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News