Thursday, April 18, 2024

నిరసనల నడుమ నేడు ప్రధాని రాక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గోదావరిఖని/జ్యోతినగర్/హైదరాబాద్ : వామపక్షాలు, వివిధ విద్యార్థి, కార్మిక సంఘాలు, న్యాయవాదుల నిరసనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పెద్దపల్లి జిల్లా రామగుండానికి రానున్నారు. విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, కార్మి క సంఘాల నేతలు తదితరులు మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివిధ ప్రాజెక్ట్‌లు, పథకాల కేటాయింపులో తెలంగాణ పట్ల వి వక్ష పూరితంగా వ్యవహరిస్తున్న ప్ర ధాని మోడీ తగిన వివరణ ఇచ్చి రా ష్ట్రానికి రావాలని వామపక్షాల నేతలతో పాటు వివిధ సంఘాల బా ధ్యులు బాహాటంగానే రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న ప్ర ధాని మోడీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థానంలో కొత్తగా ఏర్పడిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు.

ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ఆయన రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మూడు రోజుల దక్షణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఎన్‌టిపిసి, పిటిఎస్ కాలనీలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రామగుండం వెళ్లి ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఎన్‌టిపిసి మహాత్మాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులు, ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారు. సుమారు 50వేల మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లను చేపట్టారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని తిలకించేందుకు సభ నలుమూలల ఎల్‌ఈడి టీవీలను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా సుమారు 2,700 మంది పోలీసు బలగాలతో భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు.

రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌పిజి, ఎన్‌ఎస్‌జి, ఎన్‌డిఅర్‌ఎఫ్‌లతోపాటు ఏఆర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. ప్రధాని పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం వారం రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఎప్పటికప్పుడు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభా వేదిక వద్ద విఐపిలు రాక కోసం ప్రత్యేక మార్గం, సాధారణ ప్రజల కోసం మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. వేదికను శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. సంవత్సరంలో రామగుండం ఎరువుల కర్మాగారం మూత పడింది. మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్యాస్ ఆధారితంగా ఆర్‌ఎఫ్‌సిఎల్‌ను నిర్మించారు. 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, 2015 సెప్టెంబర్ 25న నిర్మాణ పనులు ప్రారంభించారు.

2016 ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఆర్‌ఎఫ్‌సిఎల్‌కు శంకుస్థాపన చేశారు. 2018 నాటికి ఆర్‌ఎఫ్‌సిఎల్ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఫ్యాక్టరీని ప్రారంభించలేకపోయారు. ఎట్టకేలకు 2021 మార్చి 22 నుంచి రూ.6180 కోట్ల రూపాయల నిధులతో పునఃప్రారంభం అయిన ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమైన ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో అమ్మోనియా, యూరియా యూనిట్ సామర్థం రోజుకు 2,200, 3,800 టన్నులు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారైన యూరియాలో తెలంగాణకు 50శాతం, ఆంధ్రప్రదేశ్‌కు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 50శాతం సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ ఫ్యాక్టరీకి అవసరం అయిన 0.55 నీటిని రాష్ట్ర ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కేటాయించింది. దాదాపు 20 నెలల తరువాత రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

కట్టుదిట్టమైన భద్రత…

ప్రధాని మోడీ సభకు రామగుండం ఎన్‌టిపిసి పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని స్టేడియంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామగుండం కమిషనరేట్, ఇతర జిల్లాల నుంచి ఐదుగురు అదనపు ఎస్‌పిలు, 25 మంది డిఎస్‌పిలు, 2వేల మంది పోలీసులు, మొత్తంగా 2,500 మంది పోలీసులు భద్రతలో పాల్గొంటున్నారు. మూడు హెలీకాప్టర్ల ల్యాండింగ్ కోసం ఎన్‌టిపిసి పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని స్టేడియం, పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాట్లు చేశారు. ప్రధాని సభను విజయవంతం చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, పెద్దపల్లి మాజీ ఎంపి వివేకానంద, మాజీ ఎంఎల్‌ఎ సోమారపు సత్యనారాయణ తదితరులు జన సమీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News