- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ (50; 26 బంతుల్లో) హై స్కోరర్ గా నిలిచాడు. డేవిడ్ తర్వాత రజత్ పటీదార్ (23) అత్యధిక పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, ఫిల్ స్టాల్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్,చాహల్, హర్పీత్ బ్రార్, మార్క్ ఎన్ సన్ తలో రెండు , జేవియర్ బార్ట్ లెట్ 1 వికెట్ తీశాడు.
- Advertisement -