Monday, May 5, 2025

పహల్‌గామ్ ఘటన.. ప్రధానికి పుతిన్ ఫోన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పహల్‌గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోధీతో ఫోన్‌లో మాట్లాడారు. పహల్‌గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే మోదీకి ఫోన్ చేసిన పుతిన్, ఉగ్రదాడిని ఖండించారు. మృతులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఉగ్రవాదులను అరికట్టడంలో భారత్‌కు తమ దేశం తరఫున పూర్తి మద్ధతు ఉంటుందని పుతిన్.. మోదీకి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్‌ధీర్ జైశ్వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్-రష్యా వార్షిక సదస్సుకు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో పర్యటించేందుకు పుతిన్ అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News