Sunday, April 28, 2024

రాఘవేంద్రరావు ఇంట విషాదం

- Advertisement -
- Advertisement -

Raghavendra Rao's Brother Krishna Mohan Passes away

హైదరాబాద్: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో బుధవారం విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మనోహర్ రావుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై కృష్ణమోహన్ రావు పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News