Monday, April 29, 2024

రాహుల్, ప్రియాంక రెచ్చగొడుతున్నారు

- Advertisement -
- Advertisement -

provoking

 

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై ప్రజల్ని పక్కదారి పట్టించి, అల్లర్లు జరిగేలా రెచ్చగొడుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రాలపై ఆదివారం విరుచుకు పడ్డారు. మైనారిటీల పౌరసత్వాన్ని లాక్కునేందుకు చట్టం లో ఎలాంటి వెసులుబాటూ లేదని ముస్లింలకు నచ్చ చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ఢిల్లీ బిజెపి కార్యకర్త ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రహోంమంత్రి అమిత్ షా సిక్కుల్ని పాకిస్థాన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని దుయ్యబట్టారు. పాకిస్థాన్‌లో అల్లరిమూకలు ఇటీవల గురుద్వారా నన్కానా సాహిబ్‌పై హింసాకాండకు పాల్పడడాన్ని ఆయన ప్రస్తావించారు.

పొరుగుదేశంలో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలను చూసి ప్రతిపక్షం ఇప్పటికైనా కళ్లు తెరవాలని విజ్ఞప్తి చేశారు. ‘సిఎఎ ను వ్యతిరేకిస్తున్నవారికి ఇదే సమాధానం. గురుద్వారా నన్కానా సాహిబ్‌లో క్రితం రోజు సిక్కులపై దాడి జరిగింది. వారు ఇక్కడికి రాలేరు. మరి వారెక్కడికి వెడతారు? అని షా నిలదీశారు. సిఎఎపై ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని చెబు తూ కేంద్ర హోంమంత్రి సిఎఎ ప్రత్యేకతల్ని ప్రజలకు చెప్పేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని బిజెపి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సిఎఎ వల్ల లబ్ధి పొందేది ఎక్కువగా దళితులు, పేదలేనని చట్టాన్ని వ్యతిరేకించేవారు పేదల వ్యతిరేకులని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, గాంధీ కుటుంబం దళిత వ్యతిరేకులని ఆరోపించారు. ఆందోళకారుల ఇళ్లకు వెళతానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వారికి మద్దతిస్తున్నారని అమిత్ షా విమర్శించారు.

Rahul and Priyanka are provoking
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News