Sunday, September 14, 2025

రాష్ట్రపతి ప్రసంగంపై తర్వాత.. ముందు నీట్ పై చర్చించాలి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం, ప్రతిపక్షం విద్యార్థులకు దన్నుగా ఉంటాయి
పార్లమెంట్ ఆ సందేశం ఇవ్వాలి
నీట్ వివాదంపై ముందు హుందాగా చర్చించాలి
ఆ తరువాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ: రాహుల్ గాంధీ డిమాండ్

న్యూఢిల్లీ : నీట్ సమస్య దేశ యువతకు, వారి భవిష్యత్తుకు సంబంధించినది కనుక నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకల అంశంపై పార్లమెంట్‌లో ‘హుందాయైన’, మేలిమి చర్చ జరపాలని ప్రధాని నరేంద్ర మోడీకి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సముదాయంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని చేపట్టడానికి ముందే నీట్ వివాదంపై చర్చ జరగాలని కోరారు.

నీట్ వివాదం ప్రస్తుతం అత్యంత ప్రధాన అంశం అని, మరి ఏ అంశంపై కన్నా దీనినే చర్చకు చేపట్టాలని ప్రతిపక్షాలు అంగీకరించాయని కాంగ్రెస్ నేత తెలియజేశారు. ‘యువజనులు కలవరపడుతున్నారు, ఏమి జరుగుతోందో వారికి తెలియదు. విద్యార్థుల ఆందోళనల ప్రస్తావనలో ప్రభుత్వం, ప్రతిపక్షం సమైకంగా ఉన్నాయని పార్లమెంట్ నుంచి యువతకు ఒక సందేశం, హామీ వెళ్లాలి’ అని ఆయన అన్నారు. ఇది అత్యంత ప్రధాన సమస్య అని ఇండియా కూటమి భావిస్తున్నదని రాహుల్ చెప్పారు.

‘ఇది యువతకు సంబంధించిన సమస్య కనుక వారికి సంబంధించిన అంశంపై శ్రేష్టమైన, గౌరవనీయమైన చర్చ జరగాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రాహుల్ తెలిపారు. వారు చర్చలో పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతిపక్ష సభ్యులు హుందాగా చర్చ జరుపుతారని ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో నీట్ సమస్యపై చర్చ జరగాలని గురువారం సమావేశంలో ప్రతిపక్ష సభ నాయకులు అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు రాహుల్ తెలిపారు. ‘ఇది వారి సమస్య అని, మీరు భారతదేశ భవిష్యత్తు కనుక మీ సమస్ంయ అత్యంత ముఖ్యమని ఇండియా కూటమిలో మేము అంతా భావించాం’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News