Monday, May 27, 2024

అకాల వర్షం.. అపార నష్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నిజామాబాద్ ప్రతినిధి : ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన అకాల వర్షం శనివారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, మాక్లూర్, నందిపేట, బాల్కొండ, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌లో శనివారం ఉదయం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం.. రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులను ము ద్ద చేసింది.

బోధన్ డివిజన్ పరిధిలోని ఎడపల్లి, రెంజల్, బోధన్, సాలూర, మోస్రా, చందూర్, కోటగిరి, పోతంగల్ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలోని బీర్కూర్, నసురుల్లాబాద్, కా మారెడ్డి తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు కిలోమీటర్ల మేర తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులతో కూ డిన వర్షం, మెరుపులతో బీభత్సం సృష్టించగా రైతులు కల్లాల్లో ఆ రబోసిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు తిప్పలు పడుతున్నారు. పలు మండలాల్లో చేతికందినా కోయని వరి పంట నేల వాలింది. ధాన్యం రాలిపోయింది.

కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు కుప్పలుగా పోసి పైన టార్పాలిన్లు కప్పుతున్నారు. చాలా ప్రాం తాల్లో ఇప్పటికే 60 శాతానికి పైగా వరి పంట కోత జరిగిపోయింది. ఇంకా మిగిలి ఉన్న 40 శాతం రైతులు కోయాల్సి ఉండగా అకాల వర్షం ముంచెత్తిందని రైతులు వాపోతున్నారు. డోంగ్లీ మండలంలో అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప లు గ్రామాల్లో ఇటీవల పంట కోత కోసిన రైతన్నలు ధాన్యాన్ని ఆరబెట్టా రు. చందూర్ మండలం, చందూర్, గోవూరు, కరేగావ్, లకా్ష్మపూర్ శివారులో పొలంలో కోసిన ధాన్యంలోకి నీరు చేరడంతో వరి తడిసి పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News