Monday, May 27, 2024

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

- Advertisement -
- Advertisement -

ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయవచ్చంటూ అమెరికా పత్రికలు కథనాలు ఇజ్రాయెన్‌ను పాడుకోవడానికి రంగంలోకి దిగుతామని బైడెన్ హెచ్చరిక
సముద్ర జలాల్లో వార్‌కు ముందే హైటెన్షన్
భారత్‌కు వస్తున్న సరుకు రవాణా నౌకను దారికాచి స్వాధీనపర్చుకున్న ఇరాన్
నౌకలో 17మంది భారతీయులు ఇరాన్ నౌకాదళ చర్యపై ఇజ్రాయెల్ మండిపాటు
తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక

టెల్‌అవీవ్ : ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష పోరు ఆరంభానికి ముందే గల్ఫ్ జలాల్లో తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. శనివారం ఇరాన్ సరుకుల రవాణా నౌక ఎంసిఎస్ ఎరిస్‌ను యుఎఇ తీరం వెంబడి తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ వాణిజ్య రవాణా నౌక భారతదేశం వైపు వస్తోందని, ఇందులో దాదాపు 17 మంది భారతీయులు ఉన్నట్లు కూ డా వార్తాసంస్థలు తెలిపాయి. ఇరాన్ రెవెల్యూషన్ గార్డ్ సైన్యానికి చెందిన నౌకా దళం సెఫా ప్రత్యేక బలగాలు పూర్తిస్థాయిలో హెలికాప్టర్ ఇతరత్రా కమెండో తరహా గగన విన్యాసాలతో ఈ నౌకపై దాడికి దిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి.

ఇరాన్ ఈ నౌకను కైవసం చేసుకున్న విషయాన్ని ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా ధృవీకరించింది. శనివారం జరిగిన ఈ పరిణామంపై ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. ఇది ఇరాన్ తన శక్తిని చాటుకునే కవ్వింపు చర్య అని, ఇటువంటి వాటిని సహించేది లేదని తీవ్ర పరిణామాలు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కాగా ఈ నౌక ఏ దేశానికి చెందినది అనేది నిర్థారణ కాలే దు. అయితే దీనిపై పోర్చుగీస్ జెండా ఉందని వెల్లడైంది. అత్యంత కీలకమైన సముద్ర మార్గంలో ప్రత్యేకించి హో ర్మూజ్ సింధుశాఖ సమీపంలో ఇరాన్ ఈ సీ ఆపరేషన్ చేపట్టింది. పైగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రపంచ నౌ కా వాణిజ్య సముద్ర జలాల్లో ఉంది.

యుఎఇ తీరానికి దగ్గర్లో తాము స్వాధీనపర్చుకున్న ఈ కంటైనర్ షిప్‌ను ఇరాన్ బలగాలు ఇరాన్ ప్రాదేశిక సముద్ర జలాల ప్రాంతంలోకి తీసుకువెళ్లాయి. సముద్ర జలాల్లో ఈ పరిణామం జరిగిందనే విషయాన్ని రెండు మారిటైం సెక్యూరిటీ సంస్థలు ప్రకటించిన కొద్ది నిమిషాలకే ఇరాన్ అధికార వార్తా సంస్థ ఈ విషయాన్ని నిజమేనని నిర్థారించింది. ఫుజైరహ్ తీరం వెంబడి ఇరాన్ చర్యకు పాల్పడిందని వెల్లడైంది. ఈ నౌకను ఇరాన్ నౌకాదళం తన అధీనంలోకి తీసుకునే క్రమపు వీడియోలు కూడా వెలువడ్డాయి. గల్ఫ్ ప్రాంతంలోనే ఇరాన్ ఈ చర్యకు పాల్పడిందని స్వతంత్ర సంస్థలు తెలిపాయి. ఇజ్రాయెల్‌పై 24 గంటలలో దాడులు జరుగుతాయని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ముందుగానే హితవు పలికింది. దీనికి ప్రతిగా అమెరికా ఘాటుగా స్పందిస్తూ ఇరాన్ చర్యలు మానుకోకపోతే తీవ్రస్థాయి పరిణామాలు తప్పవని హెచ్చరించడం ఈ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. పైగా ఇప్పటికేరగులుకున్న హమాస్, ఇజ్రాయెల్ పోరు వేదిక అయిన గాజా ఇకపై ఇజ్రాయెల్ ఇరాన్ నడుమ భీకరపోరు అనివార్యం అయితే గాజా మరింతగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం అయింది. ఇది లా ఉండగా ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయవచ్చంటూ అమెరికా పత్రికలు కథనాలను ప్రచు రించటం గమనార్హం.

కవ్వింపు చర్యలకు మూల్యం తప్పదు: ఇజ్రాయెల్
ఇరాన్ సేనలు గల్ఫ్ ప్రాంతంలో నౌకను స్వాధీనపర్చుకోవడం తీవ్రస్థాయి పరిణామాలకు దారితీస్తుందని ఇజ్రాయల్ తరఫున సైనిక అధికార ప్రతినిధి డేనియల్ హగరీ హెచ్చరించారు. శనివారం ఘటన వెంటనే ఇజ్రాయెల్ స్పందన వెలువడింది. ఇప్పుడు ఇరాన్ స్వాధీనపర్చుకు న్న నౌకకు ఇజ్రాయెల్‌కు లింక్ ఉందని ఇరాన్ నిర్థారించుకున్నట్లు వెల్లడైంది. లండన్‌కు చెందిన నౌకాసంస్థ జో డియక్ మారిటైంకు చెందిన నౌకగా దీనిని నిర్థారించారు. ఎంఎస్‌సి కానీ జోడియక్ కానీ వెంటనే దీనిపై ఎటువంటి స్పందన వెలువడలేదు. కాగా ఈ నౌక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లుతుందనేది వెంటనే నిర్థారణ కాలేదు.

ఈ నౌకలో మొత్తం పాతిక మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ నౌక భారతదేశం వైపు వస్తున్నట్లు, ఇందులో ఎక్కువ మం ది భారతీయులే ఉన్నట్లు, ఇది ఇరాన్ కైవసం అయినట్లు సమాచారం అందగానే భారతదేశం ఈ విషయంపై స్పం దించింది. భారతీయ ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఇరాన్‌కు చెందిన అధికారులతో పరిస్థితి గురించి ఆరాతీశారు. నౌక సిబ్బందికి కానీ నౌకలో ఉన్నవారికి కానీ ఎటువంటి హానీ జరగకుండా చూసుకోవల్సి ఉంటుందని ఇరాన్‌కు భారతదేశం తెలియచేసిందని వెల్లడైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనేక దౌత్యవర్గాల ద్వా రా ఇరాన్ ఈ విషయంలో తగు విధంగా వ్యవహరించేందుకు విదేశాంగ శాఖ అన్ని చర్యలూ తీసుకుంది.

డమాస్కస్‌లో పేలుడు ఘటన
ఇరాన్ ఎంబసీ సమీపంలోనే శనివారం ఉదయం ఓ వైపు ఇరాన్ తన సైనిక చర్యతో సముద్ర జలాల్లో నౌకను స్వాధీనపర్చుకున్న దశలోనే డమాస్కస్‌లో ఇరాన్ ఎంబసీ వద్ద పేలు పరికరంతో ఓ కారును ధ్వంసం చేసిన ఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News