Monday, May 6, 2024

మానవ హక్కులను గౌరవించడంపై మోడీతో చర్చించా: బైడెన్

- Advertisement -
- Advertisement -

హనాయ్: భారత్-అమెరికా సంబంధాల పటిష్టతపై భారత ప్రధాని నరేంద్ర మోడీతో గణనీయమైన చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. న్యూఢిల్లీ జి20 సదస్సును నిర్వహించినందుకు మోడీకి, ఆయన నాయకత్వానికి బైడెన్  ధన్యవాదాలు తెలియచేశారు.

భారత పర్యటన ముగించుకుని వియత్నాం రాజధాని హనాయ్ చేరుకున్న బైడెన్ ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. మానవ హక్కులను గౌరవించాల్సిన ప్రాధాన్యతను గురించి కూడా ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
దేశం శక్తిమంతంగా, సుసంపన్నంగా నిర్మించడానికి అవసరమైన మానవ హక్కులను గౌరవించాల్సిన ప్రాధాన్యతను, పౌర సమాజం పోషించే కీలక పాత్రను, పత్రికా స్వేచ్ఛను గురంచి ఎప్పటిలాగే తాను ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించానని ఆయన వివరించారు.

జి 20 సదస్సు సందర్భంగా తాను కుదుర్చుకున్న కీలక వ్యాపార ఒప్పందాల గురించి కూడా బైడెన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన యుద్ధం గురించి కూడా సదస్సులో తాము చర్చించామని, న్యాయమైన, శాశ్వతమైన శాంతి స్థాపన అవసరంపై కూడా తమ మధ్య ఏకాభిప్రాయం ఏర్పడిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News