Sunday, May 5, 2024

చంద్రబాబుపై కేసు హాస్యాస్పదం: పివి రమేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక రాష్ట్రం ఎంతో కుంగిపోయిందని పివి రమేశ్ తెలిపారు. చంద్రబాబు పాలనలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పివి రమేశ్ పని చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు సంక్రమించాయని, విడిపోయిన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. అసలు ఫైలే లేకుడా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనటం దిగ్భ్రాంతికరమని, తన వాంగ్మూలం ఆధారంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సిఎంను అరెస్టు చేయటమేంటని పివి రమేశ్ ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం భయానకంగా ఉందని, అధికారుల తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఇదే కేసులో గతంలో సిఐడికి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చానని రమేష్ పేర్కొన్నారు. యువతకు మేలు చేయటానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశామని, చట్టపరమైన విధానాలు పాటించే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కేబినెట్, చట్టసభల అనుమతితోనే వనరులు ఏర్పాటు చేశామని పివి రమేశ్ వివరించారు. నిర్ణయం తీసుకున్న నాటి ముఖ్యమంత్రి మీద కేసు హాస్యాస్పదంగా ఉందన్నారు. సీమెన్స్ ఇండియా ద్వారా గుజరాత్ ప్రభుత్వానికి స్కిల్ డెవలప్‌మెంట్ సేవలు వచ్చాయని, సిఎం, సిఎస్‌గా ఉన్నవారు అన్ని విధాన నిర్ణయాలను పర్యవేక్షించటం సహజమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News