Thursday, May 2, 2024

నాసా టీంలో మనోడు

- Advertisement -
- Advertisement -
Raja-Chari-Ready
రెండేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న రాజాచారి

హ్యూస్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తరఫున చంద్రమండల, అంగారక గ్రహ యాత్రల్లో భారత జాతికి చెందిన వ్యక్తి పాల్గొననున్నారు. నాసానుంచి ఇందుకు అవసరమైన శిక్షణ పొందిన 11 మంది వ్యోమగాములలో భారత సంతతికి చెందిన రాజా జాన్ ఉర్పుటూర్ చారి ఒకరు. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో రెండేళ్ల కఠిన శిక్షణ అనంతరం ఆయన గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 2017లో నాసా తన అర్టెమిస్ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత దరఖాస్తు చేసుకున్న 18 వేలమందినుంచి వీరిని ఎంపిక చేయడం జరిగింది.

శిక్షణ విజయవంతమైనందుకు గుర్తుగా శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజా చారి నాసానుంచి సిల్వర్ పిన్‌లను పొందారు. అనంతరం అంతరిక్షంలోకి ప్రవేశించిన తర్వాత బంగారు పిన్నులను ఇవ్వడం నాసా సంప్రదాయం. భారతీయఅమెరికన్ వ్యోమగాముల్లో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రాజా చారి మూడోవారు కాగా పురుషుల్లో మొదటి వారు కావడం గమనార్హం.

హైదరాబాద్ నేపథ్యం

రాజాచారి తండ్రిశ్రీనివాస్ వి చారికి భారతీయ నేపథ్యం ఉంది. ఆయన హైదరాబాద్‌కు చెందిన వారు కావడం విశేషం. తర్వాతి కాలంలో వారి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 41 ఏళ్ల రాజా యుఎస్ నేషనల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీనుంచి ఆస్ట్ట్రోనాట్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ తీసుకున్నారు. అనంతరం ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అంతేకాకుండా అమెరికా నౌకాదళానికి చెందిన టెస్ట్ పైలట్ స్కూల్‌నుంచి పైలట్ శిక్షణను కూడా పూర్తి చేశారు. విద్యాభ్యాసం కోసమే తన తండ్రి చిన్న వయసులోనే అమెరికా వచ్చాడన్నారు.

Raja Chari Ready for NASAs Moon Mars Missions

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News