Saturday, July 27, 2024

‘మా’ పదవికి రాజీనామా చేసిన నటుడు రాజశేఖర్

- Advertisement -
- Advertisement -

Rajasekhar

 

తాజాగా ‘మా’ అసోసియేషన్‌లో జరిగిన ‘మా’ డైరీ మీటింగ్ చాలా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అందులో రాజశేఖర్ మాటలు కూడా చాలా సీరియస్ అయ్యాయి. ఈయన చేసిన కామెంట్స్ చిరంజీవి, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలకు కూడా కోపం తెప్పించాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేస్తున్నారంటూ చిరు సీరియస్ అవ్వడం.. ఇక్కడెవరూ నిజాయితీగా లేరంటూ రాజశేఖర్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ‘మా’ ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసాడు రాజశేఖర్. ఈ విషయానికి సంబంధించి రాజీనామా లేఖ కూడా విడుదల చేసాడు. ‘మా’ అధ్యక్షుడు నరేష్ తీరును తప్పుబడుతూ ఈయన లేఖ సాగింది. ఆయన తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు రాజశేఖర్.

 

Rajasekhar Resigned from post of MAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News