Friday, May 3, 2024

ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టండి..

- Advertisement -
- Advertisement -

ఈ ఫోటోలో కనిపిస్తున్న అందాల ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? బాలీవుడ్ అందాల భామలు ఆలియా భట్ లేదా కృతి సనన్ అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. సినిమా సినిమాకు వెరైటీ క్యారెక్టర్లను ఎంచుకునే గ్యారెంటీ హిట్ కొట్టేయడమే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకుంటున్న ఒక యువ హీరోదే ఈ లేడీ గెటప్. ఆ హీరో ఎవరనుకుంటున్నారా..అతడే యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు. క్వీన్, షాహిద్, న్యూటన్, ట్రాప్డ్, స్త్రీ, కై పో చె, షాదీ మే జరూర్ ఆనా వంటి విలక్షణమైన చిత్రాలలో నటించిన రాజ్‌కుమార్ రావు తన తాజా చిత్రం లూడో చిత్రం కోసం అందాల బొమ్మగా తయారయ్యారు. అనురాగ్ బసు దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం ఘాగ్రా చోలీ ధరించి పొడవాటి జుట్టు, పెదాలకు లిప్‌స్టిక్, నుదుట బొట్టు పెట్టుకుని లేడీ గెటప్‌లో తన ఫస్ట్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు రాజ్‌కుమార్ రావు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, పంకజ్ త్రిపాఠి, ఆదిత్య రాయ్ కపూర్, సాన్యా మల్హోత్ర, ఫాతీమా సనా షేఖ్ ఇతర ప్రధాన తారాగణం. మొదటిసారి లేడీ గెటప్‌లో వెండితెరపై కనిపించనున్న రాజ్‌కుమార్ రావు ఎన్ని మెరుపులు మెరిపిస్తారో వేచిచూడాల్సిందే.

Rajkumar Rao lady getup in Ludo

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News