Friday, May 10, 2024

‘మా’లో బయటపడ్డ గొడవలు.. రాజశేఖర్ పై చిరంజీవి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో గొడ‌వ‌లు మరోసారి బయటపడ్డాయి. పార్క్ హ‌యత్‌లో గురువారం నిర్వ‌హించిన డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చిన చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు మాట్లాడుతుండగా ప‌లు మార్లు అడ్డుప‌డ్డ రాజ‌శేఖ‌ర్ ఆ త‌ర్వాత‌… పరుచూరి గోపాలకృష్ణ చేతిలో మైకు లాక్కుని వేదిక మీద ఉన్న పెద్దల కాళ్లకు మొక్కి.. మాలో జరుగుతున్న గొడవలపై ప్రస్తావించారు. దీంతో చిరంజీవి, మోహన్ బాబులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని గొడవలున్నా వాటిని మర్చిపోయి మనమందరం కలిసి మా అభివృద్ధికి కృషి చేయాలని చిరంజీవి చాలా బాగా చెప్పారని.. కానీ, అది సాధ్యం కావ‌డంలేదని, నిప్పు ఉన్నప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పోగరాకుండా ఆపలేమని రాజ‌శేఖ‌ర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

మా కారణంగా తన ఫ్యామిలో ఎన్నో గొడవలు జరుగున్నాయన్నారు. మా అసోసియేష‌న్‌లో చాలా గ్రూపులు ఉన్నాయని, నిజ జీవితంలో హీరోగా పనిచేస్తుంటే కొంత మంది వ్య‌క్తులు తొక్కేస్తున్నారు. మోహన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి పెద్దలు ఆయ‌న ప్ర‌సంగాన్ని ఆపే ప్రయత్నం చేసిన అవేమి ప‌ట్టించుకోని రాజ‌శేఖ‌ర్ చెప్పాల‌నుకున్న‌వి చెప్పేసాడు. దీంతో రాజశేఖ‌ర్ వ్యాఖ్య‌ల‌ని చిరంజీవి పూర్తిగా త‌ప్పు ప‌ట్టారు. వేదిక మీద ఉన్న పెద్ద‌ల‌ని ఆయన వ్యాఖ్య‌లు అవ‌మానించేవిగా ఉన్నాయని, గొడవల గురించి బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పినప్ప‌టికీ, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా రాజ‌శేఖ‌ర్ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసి కార్య‌క్ర‌మాన్ని ర‌సాభాస‌గా మార్చారన్నారు. ఆయన గురించి మ‌నం ఏ మాట్లాడ‌తామని, ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చిరంజీవి క‌మిటీకి సూచించారు. కాగా, మా ఎలక్షన్స్ జరిగిన కొద్ది రోజుల తర్వాత మా అసోషియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌, ఉపాద్యక్షుడు, కార్యదర్శి రాజశేఖర్‌, జీవితల మధ్య వివాదం చెల‌రేగిన విషయం తెలిసిందే.

Chiranjeevi Serious over Rajashekars Words

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News