Friday, May 9, 2025

త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, భారత సైన్యం, నేవీ, వైమానిక దళ అధిపతులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి, భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయించడానికి ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

జమ్మూ, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గామ్ మారణహోమానికి ప్రతీకారంగా, మే 7న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ కింద జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాద సంస్థల బలమైన స్థావరం అయిన బహవల్పూర్‌తో 9 టెర్రర్ క్యాంపులపై క్షిపణి దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ తర్వాత నిన్న రాత్రి పాక్.. భారత సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడికి యత్నించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ వాటిని గాలిలోనే పేల్చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News