Friday, September 19, 2025

బిఎసి మీట్ నుంచి రాజ్యసభ చైర్మన్ వాకౌట్

- Advertisement -
- Advertisement -

‘ఔచిత్యం కొరవడిన’ కారణంగా శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సభా కార్యక్రమాల సలహా కమిటీ (బిఎసి) సమావేశంలో నుంచి వాకౌట్ చేసినట్లు సభ వర్గాలు వెల్లడించాయి. అయితే, ‘డూప్లికేట్’ వోటర్ ఐడి (ఎపిక్) సంఖ్యలు, పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు బిల్లులు పంపడం సమస్యలపై చర్చ జరపాలన్న డిమాండ్‌పూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నందున చైర్మన్ వాకౌట్ చేశారని ప్రతికూల పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నేత రామ్‌జీ లాల్ సుమన్ చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఎగువ సభలో తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకున్న రోజు బిఎసి సమావేశం ఏర్పాటు చేశారు.

రామ్‌జీ లాల్ సుమన్ ఇటీవల రాజ్యసభలో మాట్లాడుతూ, సంగను ఒక ‘దేశద్రోహి’గా అభివర్ణించారు. ఇందుకు నిరసనగా కర్ణీ సేన కార్యకర్తలు బుధవారం ఆగ్రాలో సుమన్ నివాసంలో విధ్వంసం సృష్టించారు. ఈ అంశంపై శుక్రవారం రాజ్యసభ కొద్ది సేపు వాయిదా పడింది. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. సుమన్ నివాసంపై దాడిని ప్రతిపక్ష ఎంపిలు గర్హించగా, మంత్రులు, అధికార బిజెపి ఎంపిలు సుమన్‌ను ఆయన వ్యాఖ్యలపై తప్పుపట్టి, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News