Tuesday, April 30, 2024

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదం, కీలకమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం తీవ్రస్థాయి చర్చ అనంతరం ఓటింగ్‌లో నెగ్గింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీనితో ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం దక్కినందున దీనికి పార్లమెంట్ సమ్మతి లభించింది. చట్టం కానుంది. బిల్లుకు నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజెడి, జగన్మోహన రెడ్డి సారధ్యపు వైఎస్‌ఆర్‌సిపి మద్దతు తెలిపాయి. మొదటి సారి ఓటింగ్ దశలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రతిపక్షాలు తిరిగి డివిజన్‌కు పట్టుపట్టాయి. తిరిగి ఓటింగ్ జరగగా బిల్లు నెగ్గింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగబద్దమని,ఏ విధంగా కూడా సుప్రీంకోర్టు సంబంధిత విషయంపై వెలువరించిన తీర్పునకు భంగకరం కాదని అమిత్ షా తెలిపారు.

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అధికారాలను కేంద్రం గుప్పిట్లోకి తీసుకువస్తూ కేంద్రం ఇంతకు ముందు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు బిల్లు తెచ్చారు. బిల్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, దేశ రాజధానిలో పాలన అత్యంత కీలకం. అని ఇక్కడి వ్యవహారాలలో పారదర్శకతకు , అవినీతి రహిత సుపరిపాలనకు దీనిని తీసుకురావడం జరిగిందని సభకు అమిత్ షా తెలిపారు. నేషనల్ క్యాపిటల్ టెరిషియరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 202౩కు లోక్‌సభ గత వారం ప్రతిపక్ష ఇండియా కూటమి వాకౌట్ నడుమ ఆమోదం తెలిపింది. తాను తీసుకువచ్చిన బిల్లునే కాంగ్రెస్ కేవలం ఆప్ ప్రసన్నతకు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ ఒడిలో పడిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచినిరసనలు వ్యక్తం అయ్యాయి. అంతకు ముందు ఈ బిల్లుపై ఆప్ నేత రాఘవ ఛద్దా స్పందించారు.

ఇది సరైనదే అని, ఇందులో అక్రమమేమీ లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. రాజ్యసభ ఎంపి అయిన గగోయ్ సోమవారం రాజ్యసభలో దీనిపై చర్చలో మాట్లాడారు. బిల్లు నెగ్గిన విషయం తెలిసిన తరువాత ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఈ విధంగా ఢిల్లీ స్వాతంత్య్రాన్ని కబళించారని, నాలుగు సార్లు ఢిల్లీలో ఓటమి పాలయి ఈ విధంగా దొడ్డిదారిన అధికారాలు పొందారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News