Sunday, September 21, 2025

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి బాలీవుడ్‌లో యమా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమె ఖాతాలో చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇటీవలే ఆమె యానిమల్, చావా వంటి కళ్ళు చెదిరే హిందీ సినిమాల్లో కనిపించింది. సికిందర్ వంటి హిందీ చిత్రాలు ఆడలేదు కానీ ఆ సినిమా ఫలితం ఆమెపై పడలేదు. అందుకే, ఆమెకి ఇంకా బడా హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చింది. క్రిష్ 4 చిత్రంలో రష్మిక నటించనుంది.

‘కోయి మిల్ గయా’లో ప్రీతి జింటా నటించింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘క్రిష్’లో ప్రియాంక చోప్రా హీరోయిన్. ఆ తర్వాత వచ్చిన ‘క్రిష్ 3’లో కూడా ప్రియాంక చోప్రా నటించింది. అలాగే మరో కీలక పాత్రలో కంగన రనౌత్ మెరిసింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో చిత్రం ‘క్రిష్ 4’ రానుంది. ఈ సినిమాకి హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా, హిందీలో షాహిద్ కపూర్ సరసన ‘కాక్ టైల్ 2’ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News