Home తాజా వార్తలు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం…

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం…

Accident

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌ పరిదిలోని పెద్ద గోల్కొండ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

కారు గచ్చిబౌలి నుండి రింగ్‌రోడ్డు మీదుగా పెద్ద అంబర్‌పేట్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని బాధితులు చెబుతున్నారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

Road Accident At Shamshabad Outer Ring Road