Tuesday, May 21, 2024

ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. దంపతులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆగి ఉన్న లారీ (కంటైనర్) కిందకు కారు దూసుకువెళ్లిన ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా, మునగాల పరిధిలోని ముకుందాపురం గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు అతివేగంతో వెనుక నుండి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో సామినేని నవీన్ రాజు (29), భార్గవి (27) అనే దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టిఆర్ కృష్ణా జిల్లా, నూజివీడు మండల పరిధిలోని విసన్నపేట గ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బైరెడ్డి అంజిరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News