Saturday, April 27, 2024

రోహిత్ అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

Rohit Sharma

 

బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ( 194), ఎబి డెవిలియర్స్(208)తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. రోహిత్ తర్వాత గంగూలి(228), సచిన్ తెండూల్కర్ (235), బ్రియాన్ లారా (239)లు వరసగా ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు సాధించి 9000 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఇక ఇక్కడి చిన్న స్వామి స్టేడియం రోహిత్‌కు ఎంత ఇష్టమైందో చెప్పాల్సిన అవసరం లేదు.2013లో ఇదే మైదానంలో ఆసీస్‌పై డబుల్ సెంచరీ (209) సాధించిన విషయం తెలిసిందే.

Rohit Sharma becomes 3rd fastest to 9,000 runs in ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News