Sunday, December 3, 2023

ఎన్నికల తనిఖీల్లో రూ.538 కోట్లు స్వాధీనం: సిఈవో వికాస్‌ రాజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర రూపంలో రూ.538.23 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే స్వాధీనమైన వాటి విలువ రూ.5.77 కోట్లకుపైగా ఉందని చెప్పారు.

అక్టోబరు 9వ తేదీ నుంచి ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. నగదు  రూ. 184.89 కోట్లు, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు  రూ.178.61 కోట్లు, మద్యం  రూ.74. 71 కోట్లు, మత్తు పదార్థాలు  రూ. 31.64 కోట్లు, కాగా రూ.68.36 లక్షలకు పైగా విలువైన చీరలున్నాయి. బియ్యం, మొబైల్స్ సహా ఇతర వస్తువులు, కానుకలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News