Saturday, April 27, 2024

‘హోం ఓటింగ్’కు ఏప్రిల్ 22లోగా దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఈసారి 85 ఏళ్లపై బడిన వారికి హోం ఓటింగ్ అవకా శం ఉంటుందని, ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఫారం డీ పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అర్హులైన వారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సో మవారం తమ కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఎన్నికల కోసం 1.85 లక్షల మంది సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వో, డిఇవో, పోలీసు, అధికారులకు డిల్లీలో శిక్షణ తరగతులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 90వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూరి చేసినట్లు, అసెంబ్లీ ఎన్నికల తరువాత 8.58 లక్షల ఓట్లు తొలగించామని, పోలీసు సిబ్బంది పూర్తి స్ధాయిలో సిద్దంగా ఉన్నారన్నారు. ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రోడ్ షోలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ,రద్దీ ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించరాదని తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ స్పీకర్లు వాడొద్దని, ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 85 ఏళ్లు దాటిన వృద్ధులు 1.94 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నట్లు వివరించారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తరువాత 3, 4 రోజుల్లో హోమ్ ఓటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ఈసారి 48 వేల వీవీ ప్యాట్లు అవసరమని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 500 ఇవిఎంలు, 500 వీవీ ప్యాట్లు అవసరమవుతాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 1.85 లక్షల మందితో పాటు అదనంగా మరో 25 వేల మంది సిబ్బంది నియమిస్తున్నట్లు వివరించారు. పిర్యాదుల సి విజల్ యాప్ ద్వారా కాని, 1950కి ఫిర్యాదు చేయవచ్చన్నారు. రోడ్‌షోలు సెలవు రోజుల్లో , రద్దీ ఉన్న ప్రాంతాల్లో అనుమతిలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను, స్కూల్ దుస్తులకు అనుమతి లేదని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News