Saturday, April 20, 2024

ఆర్‌ఎస్‌ఎస్ ‘శాఖల’పై తిరువనంతపురం దేవస్థానం బోర్డు నిషేధం

- Advertisement -
- Advertisement -
కేరళ గుళ్లలో కవాతులపై కూడా నిషేధం!

తిరువనంతపురం: కేరళలోని గుళ్ల ప్రాంగణాలలో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులు, ఇతరత్రా కార్యకలాపాలను తిరువనంతపురం దేవస్థానం బోర్డ్(టిడిబి) నిషేధిస్తూ సర్కులర్ జారీచేసింది. దక్షిణాదిన తిరువనంతపురం దేవస్థానం బోర్డు దాదాపు 1200 గుళ్లను మేనేజ్ చేస్తోంది. టిడిబి జారీ చేసిన సర్కులర్‌లో రాష్ట్రంలోని అన్ని గుళ్లు తిరువనంతపురం దేవస్థానం బోర్డు నియంత్రణలో ఉంటాయే తప్ప, ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో కాదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి కార్యకలాపాలను గుళ్ల ప్రాంగణాలలో నిర్వహించరాదని స్పష్టం చేసింది.

తిరువనంతపురం దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. అనంతగోపన్ మీడియాతో మాట్లాడుతూ ‘గుళ్లలో వేడుకలు జరుగుతున్నందున మేము ఎలాంటి పరిశోధనలు చేయలేదు. కేవలం ఆర్‌ఎస్‌ఎస్ అనే కాదు, ఇతరులు కూడా జోక్యం చేసుకుంటున్నారు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం’ అన్నారు. 2021 మార్చిలో కూడా ఇలాంటి సర్కులర్‌నే హెచ్చరిస్తూ విడుదలచేశారు. 2016లో అయితే దేవస్థానం బోర్డు ఆర్‌ఎస్‌ఎస్ తాలూకు అన్ని ఆయుధాల శిక్షణను నిషేధిస్తూ సర్కులర్ జారీ చేసింది. ఇక తాజాగా జారీ చేసిన సర్కులర్‌లో అయితే ఎవరైతే నిషేధానికి కట్టుబడి ఉండరో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించింది. కాగా ట్రావాన్‌కోర్ దేవస్వామ్ బోర్డు సర్కులర్‌ను ఆర్‌ఎస్‌ఎస్ ఖండించింది. కాగా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.

‘ ఈ సర్కులర్ అప్రజాస్వామికం. రాజ్యాంగాన్ని హతం చేసినంతటిది. శాఖలలో ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నడూ ఆయుధ శిక్షణను ఇవ్వలేదు’ అని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఇంద్రేశ్ కుమార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News