Monday, May 6, 2024

దేవదాసి కథతో…

- Advertisement -
- Advertisement -

Samantha act in Concept oriented movie

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ సమంత. ఆమె గత కొంత కాలంగా కమర్షియల్ సినిమాల కంటే కూడా అధికంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఓకే చెబుతోంది. ఈ ఏడాది ‘జాను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ప్రస్తుతానికి మరే సినిమాను చేయడం లేదు. అయితే కొన్ని కథలు వింటున్నట్లుగా గత కొన్ని నెలలుగా వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ఒకటి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందబోతున్న దేవదాసి బెంగళూరు నాగరత్తమ్మ కథ. ఈ సినిమాను సమంతతో తీయాలనే పట్టుదలతో దర్శకుడు సింగీతం ఉన్నారట. ఆ పాత్రకు సమంత అయితే సరిగ్గా సూట్ అవుతుందని సింగీతం బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగానే ఆమెతో ఇప్పటికే రెండు, మూడు సార్లు చర్చలు జరిపారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News