Thursday, May 16, 2024

దసరా తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ సందడి

- Advertisement -
- Advertisement -

RRR Movie Shooting start from dussehra

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగియాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా చివరి దశలో ఆగిపోయింది. ఆరు నెలలుగా షూటింగ్స్ జరుగక పోవడంతో సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని కూడా మార్చుకున్నట్లుగా తెలిసింది. లాక్ డౌన్ సడలించి షూటింగ్స్‌కు అనుమతించిన వెంటనే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ను పునః ప్రారంభించాలని భావించాడు. అందుకోసం టెస్ట్ షూట్ ను కూడా ప్లాన్ చేశాడు. రెండు రోజుల్లో టెస్ట్ షూట్ అనగా అది రద్దయింది. ఆ సమయంలోనే కరోనా కేసులు వందల నుండి వేలకు పెరిగి పోయాయి. కరోనా కేసులు పెరిగిన సమయంలో రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు.

ఆతర్వాత వారు కరోనాను జయించారు. ఇక కరోనా ప్రభావం తగ్గకున్నా కూడా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌ను కూడా వచ్చే నెల నుండి మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా తర్వాత రెండు, మూడు రోజులకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. షూటింగ్ ప్రారంభమైన రెండు నుండి మూడు వారాల్లో ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన వీడియోను రాజమౌళి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి దసరా తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సందడి మొదలు కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News