Thursday, May 2, 2024

బ్యాంక్ మేనేజర్ కొడుకుగా

- Advertisement -
- Advertisement -

Mahesh act as bank manager son in Sarkari vari pata

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా – పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఈ సినిమా సెట్ వర్క్ ప్రారంభమైందని తెలిసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్‌కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారని సమాచారం. ఇక భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ సాగే ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తాడని తెలిసింది. వేలాది కోట్లు ఎగవేసిన ఓ బిజినెస్‌మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ అపవాదును హీరో ఎలా పోగొట్టాడు అన్నదే సినిమా మెయిన్ పాయింట్ అని సమాచారం. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. ఇప్పటికే ఈ సూపర్‌స్టార్ కొత్త లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News