Wednesday, October 9, 2024

స్టార్ హీరోను ఢీకొట్టే విలన్‌గా సమంత..?

- Advertisement -
- Advertisement -

Samantha to Play Villain Role in Vijay Thalapathy Next Movie

స్టార్ హీరోయిన్ సమంత హీరోలకు జోడీగానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులు, అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో శాకుంతలం, యశోద, ఖుషి వంటి పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్‌ను టేకప్ చేసినట్లు సమాచారం. అయితే ఈ అమ్మడు త్వరలోనే ఓ స్టార్ హీరోకు విలన్ కానుందట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి. ఇప్పుడు ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తెలుగులో ‘వారసుడు’, తమిళ్‌లో ‘వారిసు’ టైటిల్స్‌తో మూవీ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా అనంతరం విజయ్ తన 67వ ప్రాజెక్ట్‌ను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని లోకేష్ కనకరాజ్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’ కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. టాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో వీరిద్దరి నెక్స్‌ప్రాజెక్ట్‌పై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో సమంత నటించబోతోందట. అయితే ఆమె హీరోయిన్‌గా కాదు.. లేడీ విలన్‌గా అని తెలిసింది. విజయ్‌ను ఢీకొనే ప్రతినాయకి పాత్రలో సమంత నటించబోతోందని… ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తయ్యాయని సమాచారం. కాగా గతంలో విజయ్, సమంత జంటగా తెరి, మెర్సల్ చిత్రాలు చేశారు. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

Samantha to Play Villain Role in Vijay Thalapathy Next Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News