Wednesday, November 30, 2022

ప్రకృతిని ఆరాధించే సంక్రాంతి పండుగ

- Advertisement -

sankranthi3సంక్రాంతి పండుగ పల్లె జీవితాన్ని ప్రతిభింభించేది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర వేసే శుభ దినాలే ఈ పండుగకు తార్కాణాలు. పల్లె ప్రజలు కళ్లాల నుంచి ధన్యాన్ని ఇళ్లలోకి చేర్చుకుని, పశుపక్షాదులను ఈ పండుగలో భాగం చేస్తారు. ఆధ్యాత్మికమూ, చారిత్రాత్మకమూ, ఆరోగ్యమూ అన్నీ ఈ పండుగలో అంతర్లీనమై ఉంటాయి. సంక్రాంతిని మూడు రోజుల సంబురంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుము. ఈ మూడు పండుగలకూ మూడు ప్రత్యే కతలు ఉంటాయి. హరిహరాదుల ప్రస్తావన ఆధ్యా త్మికంలో కనిపించినా పండుగలో అన్నం పెట్టే భూమినీ, పంటలకు సహకరించే పశుపక్షా దులను, ప్రకృతినీ రైతులు ఆరాధించు కోవడమే పరమార్థంగా కనిపిస్తుంది. సంక్రాంతి అంటే సంక్రమణం అంటే మార్పు… సూర్యుడు సంచారం చేయడం. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం మొదల వుతుంది. ఆ రోజు నుంచి సంక్రాంతి పండుగను ముగ్గులతో ప్రారంభిస్తారు. సూర్యుడు ధనుర్రా శినుంచి మకరంలోకి సంచారం చేయడమే మకర సంక్రాంతి అంటుంటారు. దీన్ని పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా అంటారు. పితృదేవతల పేరున తర్పణాలు, దానధర్మాలు ఈ దినాల్లో చేస్తారు. ఈ మూడు రోజుల పండుగలో బొమ్మలు, ముగ్గులు, గొబ్బిళ్ళు, పంటలు, పశువులు, పతంగులు కోడి పందాలు చోటు చేసుకుంటాయి. ముగ్గులు మాత్రం నెల రోజులకు ముందే.
చుక్కలతో ఏకాగ్రతః పల్లెల్లో ముగ్గులు వేయడంలో ఒకప్పుడు చూపిం చిన నేర్పు ఈనాటి మహిళల్లో కాస్త లోపించిందనే చెప్పాలి. వాకిలిని అలికి ముగ్గుపెట్టడంలో నేలను మేఘాలు లేని ఆకాశంగా అభివర్ణించడం. పద్ధతిగా పెట్టే చుక్కలు నక్షత్రాలకు సంకేతం, చుక్కలను కలుపుతూ ముగ్గు వేడయం ఖగోళంలో ఎప్పటి కప్పుడు కనిపించే మార్పులకు సంకేతం, ముగ్గు మధ్యలో పెట్టే గుండ్రం సూర్య స్థానానికి సంకేతం. మరో రకంగా గీతలు స్థిత శక్తికి (స్టాటిక్ ఫోర్స్), చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్)కు సంకేతాలు. సాంకేతిక పరమైన కారణాలుగా పొల్లాలో ఉండే క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఆవుపేడ ఉపయోగపడుతుంది. క్రిమి కీటకాలను దూరం చేసే లక్షణం ఆవుపేడలో ఉంటుంది. అయినా దాటుకుని రాకుండా పిండి ముగ్గులు వేస్తా రు. దీనికి ఒక ఆకర్షణ శక్తి ఉండడం వల్లే ముగ్గులోకి లాగడం అనే మాట వచ్చిందట. మారేడు దళం, నాగవల్లి, తాబేలు, కూర్మం, చేపలు ఇలా దశావతా రాలకు సంబంధించినవన్నీ ముగ్గుల్లో ఉంటాయి. మల్లె పందిరి వంటివి యంత్రాలకు, పూజా సంబంధిత వాటికి సహకరించేవిగా ఉంటాయి. పునర్వసు నక్షత్రానికి పుష్పం, పుష్యమి నక్షత్రానికి పాము, ఆశ్లేషకు మేక, ఎద్దు, పీత వంటివి…. తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతంగా చెపుతుం టారు. ముగ్గులు పోటీలు పడి వేయడం ఈ కళలో వారు నైపుణ్యం ప్రదర్శించడం మహిళల్ని ఉత్తేజితుల్ని చేయడం కోసమే ఈ ముగ్గుల ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇంటికి చేర్చేవి… సాగనంపేవి రథాలు
sankrantiపండుగ మొదటి రోజున ఇంటిలోకి వస్తున్నట్టు ఒక రథం ముగ్గు, కనుమ నాడు వ్యతిరేక దిశగా మరో రథం ముగ్గు వేస్తారు. ఒకరు తోడుంటూ కలసి జీవించాలని ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటికి కలుపుతూ పోతుం డేవారట వెనుకటి రోజు ల్లో. ఆనాడు లోగిళ్ళు చాలా పెద్దగా ఉండేవి. అంటే అలికి ముగ్గులు పెట్టి పక్కింటి ముగ్గుతో కలపడమంటే మహిళలు ఎంత శ్రమించే వారో ఊహిం చుకోవచ్చు. నేడు ఊర్లలో వాకిళ్ళు ఊడ్చి చల్లే వారూ కరువయ్యారు. ఈ సంబురాలూ కరువ య్యాయి.
ఆటా పాటలతో గొబ్బెమ్మలుః గొబ్బిళ్ళు అంటే భూదేవిని ఆరాధించడం ఆవుపేడ తెచ్చి దానితో గొబ్బిళ్ళు చేసి, గొబ్బెమ్మలను అలంకరిస్తారు. దీనిలోని పరమార్థం సస్యరక్షణ అనేది కనిపిస్తుంది. దీనికి పూరాణ గాధలూ చెపుతుంటారు. గోమ యం తో చేసేవి గోపీయమ్మ గొబ్బెమ్మ, ఇవి గుమ్మ డిపూవు, పిండి కొమ్మతో అలంకరిస్తారు. అమ్మా యిలు సంధ్యవేళ పాటలు పాడుతూ గోపికల్లా గొబ్బె మ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పడతారు. ఈ పాటలన్నీ కృష్ణుడికి సంబంధించిన పాటలు. ఇవి కాకుండా విత్తు విత్తారు ఏమి విత్తూ విత్తారు అని వ్యవసాయ సంబంధమైన పాటలు కూడా పా డతారు.
పాతను తరిమే భోగిమంటలుః భోగిమంట వేసినప్పుడు ఇంట్లో పాత తట్టాబుట్టా, కలపను మంటల్లో వేసి పాతను తరిమివేసి కొత్తను ఆహ్వా నిస్తారు. basavannaపాతవస్తువుల్లో క్రిమికీటకాలు చేరి ఉంటాయి కాబట్టి అవి మంటల్లో నశిస్తాయి. అయితే భోగిమం టల్లో ఇంటిముం దరపెట్టే గొబ్బెమ్మల్ని పిడకలుగా ఎండబెట్టి వేస్తారు. ఈ పొగను పీల్చడం వల్ల ఊపిరితి త్తుల వ్యాధులు తగ్గుతా యని పెద్దలంటుం టారు. ఆ పిడకల వేడితో వళ్ళుకాచు కుని, నల్ల నువ్వుల ముద్ద తో మర్దన చేసి వేడి నీటి స్నా నం చేయ డం వల్ల శరీర రుగ్మతలు తొలు గుతా యని ఆయు ర్వేద నిపు ణులు సూచి స్తుం టారు.
పిల్లల కోలాహలం భోగి పండ్లుః పిల్లలకు దిష్టిగా భోగి పండ్లు, రాగిపైసలు, పువ్వులు కలిపి పోస్తారు. భోగభా గ్యాలు కలగా లని పెద్దవాళ్ళు దీవిస్తుం టారు. బొమ్మల కొలు వు, భోగిపండ్లు పోయ డాన్ని ఈ మూడు రోజుల పండుగలో పిల్లలు ఆనం దించే ఓ వేడుక.
సంక్రాంతి పులగంఃతెలంగాణ ప్రాంతం లో నువ్వులు-బియ్యం కలిపి దంచి పులగం వండుతారు. నువ్వులు, రేగిపండ్లు నీళ్లలో వేసి స్నానం చేస్తారు. పాలు పొంగించి పర మాణ్ణం వండుతారు. అందరి ఇళ్ళలోనూ అరిసెలు, శకినాలు (చక్కిలా లు), గారెలు వంటివి చేసుకుం టారు. నువ్వులు వంట్లో వేడిని పెంచు తుం దనీ, నువ్వుల నూనె తలకు పట్టించి స్నానం చేయడంలో ఆరోగ్య సూత్రం ఉందని పెద్దవాళ్ళు చెపుతుంటారు.
గంగిరెద్దుల ఆటః గంగిరెద్దుల ఆడించడం ఊరం తా ఓ వేడుకలా చూస్తారు. గంగి రెద్దులను అలం కరించి ప్రతి ఇంటి కి పోయి అయ్య గారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అని సన్నాయి వాయిస్తారు. వారికి బియ్యం, పిండి పంటలు, కాను కలు గా ఇస్తారు. ఈ పండుగకు ఆంధ్రా ప్రాంతంలో కోళ్ళ పందాలు బాగా జరుపు కుంటారు. జూదం లాంటి ఈ ఆటకు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధిం చినా పందాలు పెరుగుతు న్నాయే గానీ తరగడం లేదు.
హరిదాసు కీర్తనలుఃహరిదాసుల గజ్జెల సవ్వడికి, చిరుతల చప్పుళ్ళు, ఆయన పాడే సంకీర్తనలు హాయి గా మేల్కొల్పు తాయి. ధనుర్మాసం నెలమొత్తం ప్రత్యే కమైన విశేషం. అప్పుడే ఇంటికి పంటలన్నీ వచ్చి ఉండడం వల్ల చేటలతో ధాన్యం ఇచ్చి, అది భిక్షగా కాకుండా హరిదాసును సన్మానించు కోవడం గా రైతులు భావిస్తారు. పాత్రలో ధాన్యం ఇవ్వడం వల్ల పంటలు వృద్ధి అవుతాయని రైతులు భావి స్తారు.
పశువుల పండుగః మూడవ రోజైన కనుమను పశువుల పండగ అని కూడా అంటారు. తమ చేతికొచ్చిన పంటను తమకే కాక, పశువులు, పక్షులు పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకు లను ఇంటి గుమ్మాలకు కడతారు. కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేసి, పేడతో అలికి బియ్యపిండితో అందంగా ముగ్గులు పెడతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులను, వ్యవసాయంలో తోడ్పడే ఎడ్లను శుభ్రంగా కడిగి కుంకుమ, పసుపు, వూలతోటి అలంకరించి పూ జిస్తారు. వ్యవసాయ పనిముట్లను కూడా పూజలో ఉంచుతారు. అనంతరం పశువుల కొట్టాలలోనే పొం గలి వండుతారు. ఇందులో పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో ‘పొలి’గా చల్లుతారు. అనంతరం బాగా పండి ఉన్న గుమ్మడికాయను పగలగొట్టి దిష్టితీస్తారు. ఆ తరువాత పొంగలిని పశువులకు తినిపిస్తారు.

Related Articles

- Advertisement -

Latest Articles