Friday, March 29, 2024

‘ల‌వ్ స్టోరీ’ నుంచి ‘సారంగ దరియా’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్య‌, ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి కలిసి నటిస్తున్న చిత్రం ‘ల‌వ్ స్టోరీ’. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ ప్రేమ క‌థా చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతోపాటు టీజర్ కు మంచి స్పందన వస్తుంది. తాజగా ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ అంటూ సాగే పాట‌ను హీరోయిన్ సమంత తన ట్విట్ట‌ర్‌ ద్వారా విడుద‌ల చేసింది. ఈ పాటలో మరోసారి సాయి పల్లవి తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తోపాటు అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తోంది. పవన్ సంగీత సారథ్యంలో మంగ్లీ పాడిన ఈ పాట సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.  ఇక, ఈ మూవీని ఏప్రిల్ 16న గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Saranga Dariya song released from Love Story

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News