మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పరం గా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చే స్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభు త్వం నిర్ణయించించింది. సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల ని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే స్థానిక ఎన్నికలు కోర్టు విధించిన గడువులో గా నిర్వహించడం సాధ్యం కాదని, ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం క మాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసిం ది. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభ ఆ మోదించిన బిల్లు, అలాగే రిజర్వేషన్లను 50 శా తానికి పరిమితం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన చట్టాన్ని సవరణ చేస్తూ మరో బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, అలాగే బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజరేష్వన్లు కల్పిస్తూ
శాసనసభ ఆమోదించిన మరో బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న కారణంగా వీటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలను ఇప్పుట్లో నిర్వహించడం సాంకేతికంగా సాధ్యం కాదని హైకోర్టుకు తెలియజేయాలని సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో న్యాయ నిపుణులు సూచించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు ఇదే విషయాన్ని వెంటనే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయాలని, సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు ఈ వర్గాల సమాచారం. అలాగే గవర్నర్ తనకు పంపిన బిల్లుపై మూడు నెలలలో నిర్ణయం తీసుకోవడం కానీ, తిప్పిపంపడం కానీ చేయాలని ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అంశం పై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
Also Read: ఆస్ట్రేలియా మహిళలదే సిరీస్