Saturday, September 14, 2024

9న చెస్‌ఛాంపియన్ షిప్ క్రీడలు ప్రారంభించనున్న డిజిపి, శాట్స్ ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వక్తలు

మన తెలంగాణ / హైదరాబాద్ : చెస్ ఛాంపియన్ క్రీడలకు మరోసారి తెలంగాణ వేదిక కానుంది. తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ముఖ్య అతిథిగానూ, తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ ( శాట్స్) ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ గౌరవ అతిథిగాను హాజరుకానున్న ఈ క్రీడా వేడుకలు తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్, ది డెక్కన్ క్లబ్ సికింద్రాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో మారేడుపల్లిలోని ది డెక్కన్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ ఎలైట్ ఇన్విటేషన్ చెస్ ఛాంపియన్ షిప్ 2023 పేరిట జరగనున్నాయి. ఈ చెస్ ఛాంపియన్‌షిప్ వాల్ పోస్టర్‌ను ఈ మేరకు డెక్కన్ క్లబ్ అధ్యక్షులు బి .అనిల్ కుమార్ ,కార్యదర్శి ఎం ఎస్ శ్యామ్ ,ఉపాధ్యక్షులు ఏ ముఖేష్, కోశాధికారి ఎం వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర స్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎస్ ప్రసాద్‌లు గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ చెస్ ఛాంపియన్‌షిప్ క్రీడలకు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ముఖ్యఅతిథిగాను, శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ గౌరవ అతిథిగాను హాజరుకానున్నట్లు తెలిపారు. విజేతలకు బహుమతి ప్రధానోత్సవంతో పాటు ఈ క్రీడల ముగింపు కార్యక్రమం 10వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు జరుగనుందన్నారు. ఈ పోటీలలో ప్రముఖ క్రీడాకారులు సుమీర్ హర్షు చిద్విల సాయి,పవన్ కార్తికేయ ,శ్రీరామ ఆదర్శ్, ఉప్పలచల్లా, సహస్ర భవిష్క, సరయు, కీర్తి గంట అభిరామి, మోడీపల్లి దీక్షిత సంహిత, అంకిత గౌడ్ లాంటి క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. మేధోవంతమైన క్రీడగా ప్రసిద్ధిగాంచిన చెస్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని డెక్కన్ క్లబ్ స్పోర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. నర్సయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి తమ కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News