Saturday, July 27, 2024

కశ్మీరులో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు సమీక్షించాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:జమ్మూ కశ్మీరులో ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేస్తూ జారీచేసిన ఉత్తర్వులను వెంటనే సమీక్షించాలని శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలా సస్పెండ్ చేయడం ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితం చేయాలని, ఇది న్యాయసమీక్ష పరిధికి సంబంధించిన అంశమని జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వారంరోజుల్లోగా ఆంక్షలపై సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జమ్మూ కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత గత 160 రోజుల నుంచి కమూనికేషన్ సర్వీసులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ రాజ్యాంగంలోని 19వ అధికరణ మేరకు ఇంటర్నెట్ హక్కుతోసహా భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉంటాయని దర్మాసనం పేర్కొంది. ఆంక్షలకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను ప్రజల ముందు పెట్టాలని, దీని వల్ల వీటిని కోర్టులో సవాలు చేసే అవకాశం ప్రజలకు ఉంటుందని కోర్టు తెలిపింది. ఏకపక్ష ఉత్తర్వుల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం కుదరదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

SC asks Centre to review suspension of Internet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News