Friday, March 29, 2024

సిసోడియాకు ఎదురుదెబ్బ!

- Advertisement -
- Advertisement -
వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సిబిఐ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. పైగా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున హైకోర్టును ఆశ్రయించాలని కోరింది. సిబిఐ కస్టడీలో ఉన్న సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చీఫ్ జస్టిస్ డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

ఢిల్లీ రూప్ అవెన్యూ కోర్టు సిసోడియాను మార్చి 4 వరకుఉ సిబిఐ కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కాలంలో నిరంతరం సిసిటివి పర్యవేక్షణలో ఉంటారు. ఆయనను రోజూ కలవడానికి ఆయన భార్య, న్యాయవాదికి అనుమతిచ్చింది కోర్టు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News