Tuesday, April 23, 2024

సెన్సెక్స్ లాభాల జోరు

- Advertisement -
- Advertisement -

Sensex

635 పాయింట్లు జంప్

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 190.55 పాయింట్లు పెరిగి 12,215.90 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12,224 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. అక్టోబర్ 9 తర్వాత ఒక రోజు అతిపెద్ద లాభం ఇదే. ఆసియా మార్కెట్ల నుండి సానుకూల సంకేతాల కారణంగా భారత మార్కెట్ ఊపందుకుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్‌తో శాంతియుత ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇది అమెరికా, ప్రధాన ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 26, 50 నిఫ్టీ స్టాక్స్‌లో 43 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 11 రంగాల సూచికల్లో 10 లాభాల్లో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ అత్యధికంగా 2.7% పెరిగింది. ఐటి ఇండెక్స్ మాత్రమే 0.18 శాతం కోల్పోయింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నాల ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా పెరిగింది. ట్రేడింగ్ సమయంలో రూపాయి 22 పైసలు పెరిగి 71.48 కు చేరుకుంది. ఇది బుధవారం 71.70 వద్ద ముగిసింది.

Sensex gains 635 points

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News