Thursday, May 2, 2024

భీమ్ ఆర్మీ చీఫ్‌కు ఎయిమ్స్‌లో తక్షణ వైద్యం

- Advertisement -
- Advertisement -
Chandrashekhar-Azad
తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : తీహార్ జైలులో పోలీసైథీమియా (రక్తసంబంధ వ్యాధి) తో బాధపడుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్‌కు తక్షణం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యం అందించాలని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న అజాద్‌కు ఎయిమ్స్ వైద్యులే వైద్యచికిత్స అందిస్తున్నారని,ఇప్పుడు ఆయనకు ఎయిమ్స్‌లో వైద్యం తక్షణం అందకపోతే గుండె పనిచేయని పరిస్థితి ఏర్పడుతుందని అజాద్ తరఫు న్యాయవాది మెహమూద్ ప్రచా కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అరుల్ వర్మ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జామా మసీదు నుంచి జంతర్‌మంతర్ వరకు అజాద్ ర్యాలీ నిర్వహించినందుకు డిసెంబర్ 21న పోలీసులు అజాద్‌ను అరెస్టు చేసి తరువాత తీహార్ జైలుకు తరలించారు.

Treat Bhim Army chief Chandrashekhar Azad in AIIMS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News