Wednesday, December 4, 2024

రూ.30 కోట్లు సమీకరించనున్న ‘శ్రేయాస్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రమోషన్స్, మూవీ ఈవెంట్స్ కంపెనీ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారులు ఈ నిధులను సమకూరుస్తున్నారు. 2011లో ప్రారంభమైన హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉండడం విశేషం. ఇటీవలే కంపెనీ దుబాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్ తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News