Tuesday, June 18, 2024

స్వాతి మాలివాల్ కేసు దర్యాప్తుకు సిట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్వాతి మాలీవాల్ పై జరిగిన దాడి సంఘటనపై దర్యాప్తునకు ఢిల్లీ పోలీస్‌లు తాజాగా సిట్ ఏర్పాటు చేశారు. దీనికి నార్త్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటరీ కమిషనర్‌ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహిస్తారు. దీనితోపాటు సిట్‌లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు. వీరిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేసన్‌లోని ఒక అధికారి కూడా ఉన్నారు. ఈనెల 13న దాడి జరిగిన క్రమాన్ని తెలుసుకోడానికి సోమవారం ఢిల్లీ పోలీస్‌లు బైభవ్‌కుమార్‌ను సిఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.

అన్ని ప్రశ్నలకు సమాధానాలను సీక్వెన్స్‌గా నోట్ చేసుకున్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని ఫోటోలు తీశారు. ఇదిలా ఉండగా, దాడికి సంబంధించిన సాక్షాలను ధ్వంసం చేసేందుకు బైభవ్ ప్రయత్నించినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. బైభవ్ తన ఫోన్‌ను ముంబైలో ఫార్మెట్ చేసినట్టు తెలుస్తున్నందున ఆయనను అక్కడకు తీసుకు వెళ్తున్నట్టు తీస్‌హజారీ కోర్టుకు ఢిల్లీ పోలీస్‌లు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News