Saturday, July 27, 2024

ఈ ఏడాది ఆరు గ్రహణాలు

- Advertisement -
- Advertisement -

eclipses

నేడు రాత్రి 10.36 గంటలకు పాక్షిక చంద్ర గ్రహణం

ఇండోర్ : 2020లో ఆరు గ్రహణాలను సందర్శించే అవకాశం ఖగోళ పరిశీలకులకు, గగన వీక్షకులకు కలుగుతుంది. వీటిలో మూడు మాత్రమే భారత్ ప్రజలకు చూడడానికి వీలవుతుంది. ఈ ఆరింటిలో నాలుగు చంద్రగ్రహణాలు కాగా, మిగతా రెండు సూర్యగ్రహణాలు. ఈ ఏడాది జనవరి 10,11 తేదీల్లో అంటే శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుందని ఉజ్జయిన్ కేంద్ర జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా వెల్లడించారు. దేశంలో ఈ పాక్షిక గ్రహణం కనిపిస్తుందని అన్నారు. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణమైన ఈ గ్రహణం శుక్రవారం రాత్రి 10.36 గంటలకు ప్రారంభమై శనివారం తెల్లవారు జాము 2.44 గంటల వరకు సాగుతుందని చెప్పారు.

ఇదే విధంగా తరువాతి పాక్షిక చంద్రగ్రహణం జూన్ 5,6 తేదీల మధ్య రాత్రి జరుగుతుంది. ఇది కూడా దేశంలో అందరికీ కనిపిస్తుంది. జులై 5,నవంబర్ 30 తేదీల్లోనూ పాక్షిక చంద్రగ్రహణాలు సంభవిస్తాయని గుప్తా వివరించారు. అయితే ఈ రెండూ సూర్యాస్తమయానికి ముందే జరగనున్నందున భారత్ లో ఎవరికీ వీటిని చూడడం వీలుకాదు. వలయాకార సూర్య గ్రహణం జూన్ 21న సంభవిస్తుంది. దేశంలో అందరూ దీన్ని చూడవచ్చు. డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినా ఇది రాత్రి వేళ జరుగుతుంది కాబట్టి భారత్‌లో ఎవరూ దీన్ని చూడలేరని గుప్తా వివరించారు.

Six Eclipses in 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News