Monday, May 6, 2024

ప్రపంచంలో జపాన్ పాస్‌పోర్టు పవర్‌ఫుల్

- Advertisement -
- Advertisement -

Japanese-Passport

పాక్‌కు పరమ అధ్వాన్న నాలుగో స్థానం
హెన్లీ పాస్‌పోర్టు సూచిక వెల్లడి

న్యూఢిల్లీ : ముందుగా ఎలాంటి వీసాలు లేకుండా ప్రపంచం లోని దేశాలను సందర్శించగల అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశాలు ఏవి అన్న కోణం లో హెన్లీపాస్‌పోర్టు ఇండెక్సు బుధవారం వివరాలు విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచంలోనే జపాన్ అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశంగా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్సులో అగ్రస్థానం సాధించింది. ప్రపంచంలో ఈ దశాబ్దంలో అత్యంత ట్రావెల్‌ఫ్రెండ్లీ పాస్‌పోర్టులు కలిగిన దేశాలు ఏవేవి ? అన్న కోణంలో హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్సు బుధవారం ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ సూచికలో జపాన్ అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశంగా అగ్రస్థానంలో ఉన్న ట్టు వెల్లడించింది. తరువాత రెండవ స్థానంలో సింగపూర్ ఉంది. దక్షిణ కొరియా, జర్మనీ మూడో స్థానంలో ఉన్నాయి. జపాన్ దేశీయులు ఎలాంటి వీసా లేకుండా 191 దేశాలను సందర్శించ గలరు.

ఈ 2020 సంవత్సరమే కాదు గత మూడేళ్లుగా ఈ ఆధిక్యతను జపాన్ సాధిస్తోంది. ఈ ఏడాది భారత్ రెండు స్థానాలు దిగజారి 84 వ స్థానానికి చేరింది. ఇదే వరుసలో మారిటానియా, తజికిస్థాన్ ఉన్నాయి. వీసా ఫ్రీతో భారతీయులు 58 దేశాలు సందర్శించ గలరు. పాకిస్థాన్ 104 వ స్థానంలో ఉంది. పాక్ పాస్‌పోర్టు హోల్డర్లకు 32 దేశాలకు వీసా ఫ్రీ అవకాశం కలిగి ఉంది. గత ఏడాది పాకిస్థాన్ పాస్‌పోర్టు పరమ నాలుగో అధ్వాన్న పాస్‌పోర్టు దేశంగా సూచికలో చేరింది. సిరియా, ఇరాక్, అప్ఘనిస్థాన్, ఈ మూడు దేశాల కన్నా పాక్ పాస్‌పోర్టు ర్యాంకు మెరుగ్గా ఉంది. సొమాలియా నాలుగో అధ్వాన్న స్థానంలో ఉంది. అమెరికా రెండు స్థానాలు దిగజారి 8వ స్థానానికి చేరింది. బ్రిటన్, నార్వే, గ్రీస్, బెల్జియమ్, ఇదే స్థాయిలో ఉన్నాయి. 9 వ స్థానంలో కెనడా ఉంది. పదేళ్ల క్రితం వీసా ఫ్రీ లోను, 166 దేశాల సందర్శనకు అనుకూలమైన వీసా ఫ్రీ దేశంగా బ్రిటన్ నెంబర్ వన్ స్థానంలో ఉండేది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News