Saturday, September 23, 2023

విద్యుత్ షాక్‌తో ఆరుగురు కూలీల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ధన్‌బాద్ : విద్యుత్ స్తంభం పాతేందుకు వెళ్లిన ఆరుగురు కార్మికులు సోమవారం కరెంటు షాక్‌తో దుర్మరణం చెందారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా నిచిత్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో వీరు కరెంట్ స్తంభాన్ని ఎత్తేందుకు యత్నిస్తుండగా ఇది అదుపు తప్పి పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లపై పడి వీరు విద్యుద్ఘాతంతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధాని రాంచీకి 145 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని బాగ్మారా డిఎస్‌పి తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద విద్యుద్ధీకరణ పనుల గురించి కార్మికులు వెళ్లినట్లు తెలిసింది. ఘటన గురించి తెలియగానే ధన్‌బాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ కమల్ కిషోర్ సిన్హా అక్కడికి తరలివెళ్లారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది తెలుసుకుంటున్నామని వారు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News