Saturday, May 4, 2024

భార్యాబిడ్డలతో సహా 13 మందిని కాల్చిచంపిన కాంగో సైనికుడు

- Advertisement -
- Advertisement -

గోమా (కాంగో): ఈశాన్య కాంగో లోని ఓ సైనికుడు తాను ఇంటికి రాకముందే తనకు తెలియకుండా కొడుకు మృతదేహాన్ని ఖననం చేశారన్న కోపంతో 13 మందిని కాల్చి చంపాడు. మృతుల్లో తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్తమామలు, అక్కడి పౌరులు ఉన్నారు. మృతి చెందిన వారిలో 10 మంది పిల్లలు ఉండడం విచారకరం. శనివారం ఈ సంఘటన జరిగింది. ఈశాన్య కాంగో లోని లుటూరి ప్రావిన్స్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జులెస్ ఎంగోంగో ఈ సంఘటన వివరాలు తెలియజేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన సైనికుడు ఎవరో ఇంకా గుర్తించలేదు. సైనికుని కొడుకు గురువారం సహజ కారణం గానే చనిపోగా తాను రాకముందే కుటుంబీకులు , బంధువులు తన కొడుకుని ఖననం చేయడం జరిగింది. ప్రావిన్స్ లోని మరో గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఈ సైనికుడు శనివారం ఇంటికి రాగానే తన కుటుంబీకులు,

బంధువులు తన కొడుకు మృతికి సంతాపంగా గుమికూడి ఉండడాన్ని చూశాడు. తాను రాకముందే తన కొడుకు మృతదేహానికి ఖననం చేశారన్న కోపంతో ఇంటికి రావడం తోనే కాల్పులకు పాల్పడ్డాడని స్థానిక గ్రామ పెద్ద బరకా ముగువా ఆస్కార్ వివరించారు. తన అనుమతి లేకుండానే తన కొడుకుని ఖననం చేయడం సైనికునికి నచ్చలేదని ఆయన తెలిపారు. కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్ సాయుధ దళాల సభ్యుడైన ఈ సైనికుడు పరారీ కాగా, పట్టుకోడానికి కాంగొలెస్ ఆర్మీ సైనికులను పంపించింది. తూర్పు కాంగోలో 120 గ్రూపులు అధికారం, భూమి, విలువైన ఖనిజ వనరుల కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. మిగతా వారు వారి నుంచి తమ సమాజాలను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ వారం మొదట్లో ఐక్యరాజ్యసమితి కూడా ఈశాన్య ప్రాంతంలో హింస పెచ్చుమీరు తోందని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News