సెవెన్ హిల్స్ బ్యానర్‌పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజిని వర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. జూలై 4వ తేదీన వెండి తెరపై ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) లో అమరుడైన జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… “చిత్ర ట్రైలర్ ఎంతో బాగుంది. చాలా మంచి విజువల్స్ కనిపించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “సోలో బాయ్ చిత్రం మధ్య తరగతి కుటుంబాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు”అని అన్నారు. చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. “సోలో బాయ్ అనగానే ఎంతోమంది సోలోగా వచ్చి ఉన్నత స్థాయికి చేరిన వారు నాకు గుర్తొస్తారు”అని పేర్కొన్నా రు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రమిదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పి పట్నాయక్, సుధాకర్, యాట సత్యనారాయణ పాల్గొన్నారు.