Saturday, April 20, 2024

సిఎఎకు వ్యతిరేకంగా పాటలు, పద్యాలతో ప్రదర్శనలు

- Advertisement -
- Advertisement -

CAA

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న ఆందోళన కారులకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ లోని కళాకారులు పాటలు, పద్యాలతో బుధవారం ప్రదర్శనలు సాగించారు. వీరంతా సఫ్దార్ హష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని కానిస్టిట్యూషన్ క్లబ్ వద్ద సమావేశమై ప్రదర్శనలు సాగించారు. ఈ సందర్భంగా సఫ్దార్ హష్మి సోదరుడు సొహైల్ హష్మి తన సోదరుడు సహీబాబాద్ వద్ద థియేటర్‌లో 1989 జనవరి1న ప్రదర్శనలు ఇస్తుండగా, పాశవికంగా దాడికి గురయ్యాడని, ఆయన జ్ఞాపకార్థం ఏటా ఇదే రోజున ప్రజాస్వామ్య, సెక్యులర్ విలువలను ప్రబోధిస్తూ ప్రదర్శనలు ఇస్తుండడం పరిపాటిగా పేర్కొన్నారు.

ఇందుకోసమే సఫ్దార్ హష్మి మెమోరియల్ ట్రస్ట్ 1989 ఫిబ్రవరిలో ఏర్పాటైందని చెప్పారు. ఈరోజు సిఎఎ లేదా కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అమలుతో మన ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని ఆయన చెప్పారు. ఎవరైతే ధైర్యంగా సిఎఎ లేదా ఇతర రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తారో వారికి ఈ ప్రదర్శనలు సృజనాత్మక మద్దతు అందిస్తాయని వివరించారు. రంగస్థల, చలన చిత్ర నటులు ఎంకె రైనా, మాజీ బ్యూరోక్రాట్ హర్ష్ మందిర్, ఆర్థిక వేత్తలు ప్రభాత్ పట్నాయక్; జయతి ఘోష్ తదితరులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

Songs and poems in Delhi against the CAA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News