Saturday, July 27, 2024

వన్ నేషన్‌-వన్ రేషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -
Ration-Card
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో…

న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. నూతన సంవత్సరం తొలిరోజున ఎపి, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపురల్లో ప్రారంభించింది. ఈ 12 రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు వారు ఏ రాష్ట్రంలో నివసిసున్నా తమ రేషన్ వాటాను పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. 2020 జూన్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒన్ నేషన్..ఒన్ రేషన్ సదుపాయానికి అనుసంధానిస్తారు. ఈ సదుపాయం కింద నూతన ఫార్మాట్‌లో రేషన్ కార్డును రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. జూన్ 1, 2020 నుంచి నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి.

జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి : పాశ్వాన్

వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం వచ్చే జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు. బయోమెట్రిక్ లేదా ఆధార్ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు.

Start of One Nation One Ration in 12 States From january 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News