Tuesday, April 30, 2024

ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్‌లు

- Advertisement -
- Advertisement -

నల్గొండ:మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమ ంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చాలనాలు విధించడంతో పాటు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు జిల్లా యస్.పి అపూర్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై నెలలో జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 507 మంది ప ట్టుబడగా వీరిని కోర్టులో హాజరుపరచగా 6 గురికి ఒక రోజు, ఒక్కరికి రెండు రోజులు,06 గురికి మూడు రో జులు, ఒక్కరికి నాలుగు రోజుల జైలు శిక్ష మరియు జరిమానా వే స్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు.

ఈ నెల ఇప్పటి వరకు మొత్తం 1317 డి.డి కేసుల న మోదు కాగా 62 6706/- రూపాయల జరిమాన విధించారని తెలిపా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టే షన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో పట్టుబడిన వారందరి రోడ్డు ప్రమాదాల పట్ల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతీ వాహన దారులు వాహనానికి సంబందించిన సరియైన పత్రా లు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో,పబ్లిక్ ప్లేస్ లలో మద్యం తా గితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News